మోదీ 3.0 : కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ !

మోదీ 3.0 :  కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి,  బండి సంజయ్ !

కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్‌డియే ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ కేబినెట్ పదువులు దక్కాయి.  పార్టీలో సీనియర్ల్ లీడర్లు అయిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు దక్కింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి  బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు.  వీరికి ప్రధానిమంత్రి కార్యలయం నుంచి ఫోన్లు వచ్చినట్లుగా సమాచారం.  తెలంగాణలో కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.  

ఇక ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌‌ లకు కేబినెట్ లో చోటు దక్కింది. వీరితో పాటుగా నితిన్ గడ్కరీ, మేఘ్‌వాల్, శర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, షిండే వర్గం శివసేన నేత ప్రతాప్ రావ్ జాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్ కాల్స్ వచ్చాయి. నేడు వీరంతా ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో నేతగా మోదీ నిలిచారు.