
- ఇన్ని రోజులు ఏం పీకినవ్?
- ఎన్నికలప్పుడే భైంసా గుర్తొచ్చిందా..?
- తాగుడు.. ఊగుడు.. పండుడు.. ఇదే కేసీఆర్ నైజాం..!
- భైంసాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
భైంసా : దొంగ దీక్ష చేసి.. దళితుడిని సీఎం చేస్తాననీ మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత.. తాగుడు.. ఊగుడు.. పండుడే అనే నైజాంతో ఉన్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడే భైంసా గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఏం పీకినవ్ కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. నిర్మల్‌జిల్లా ముథోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ కు మద్దతుగా భైంసాలో జరిగిన భారీ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు.
‘పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునే దాకా ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ, బీజేపీని తిట్టడం అలవాటైపోయింది. సోయిలేని కేసీఆర్ ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నడు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే.. ముందుగా ఆ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్లోకి వెళ్లకుండా గ్యారెంటీ ఇవ్వాలి. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే భైంసాను మహిషాగా మారుస్తం’ అని హామీ ఇచ్చారు.