తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఖమ్మం జిల్లా పరిస్థితిని కూడా అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతో పాటు ప్రకాశ్ నగర్ లోగుట్టపై పలువురు వరదల్లో చిక్కుకున్నట్లు చెప్పామన్నారు.
అమిత్ షా ఆదేశాలతో తెలంగాణకు 9 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వచ్చినట్లు బండి సంజయ్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసకుంటూ సహాయక చర్యలు కొనసాగించాలని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పామన్నారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితిని పొంగులేటిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు బండి సంజయ్.
ALSO READ | మున్నేరు వాగు ఉగ్రరూపం..వరదల్లో చిక్కుకున్న ముగ్గురు యువకులు