
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్
కరీంనగర్ సిటీ, వెలుగు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.. మనందరికీ దేవుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. తన జీవితమంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుaడని కొనియాడారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంబేద్కర్ జీవితం నేటితరానికి అనుసరణీయమన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, కేంద్ర మంత్రి పదవులు సహా ఉన్నత పదవుల్లో దళిత, బహుజన బిడ్డలు కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షేనన్నారు. కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.