కేసీఆర్ రైతులకు చేసే ఆర్థిక సాయం రూ.10 వేలు మాత్రమే.. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ అన్నారు. రైతు పక్షపాతి ఎవరో.. ఎన్నికల సమయంలో మీరే ఆలోచించి.. ఓటేయాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామన్నారు.
మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పారు. కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయని విమర్శించారు. ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల అని మండిపడ్డారు. కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర అని చెప్పారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు. కానీ తనపై ఉన్న కేసుల పరిస్థితి ఏంటని అడిగారు. తనది ప్రజల పక్షాన పోరాటాల చరిత్ర.. ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే.. అవన్నీ ప్రజలకు రాసిస్తానని చెప్పారు. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుదని.. కాబట్టి తమకు ఓటేయాలని బండి సంజయ్ కోరారు.