కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయ్యా పేరు చెప్పుకొని మంత్రి అయ్యావని, అమెరికాలో చిప్పలు కడిగిన నువ్వు నన్ను విమర్శిస్తావా అని కేటీఆర్ పై బండి సంజయ్ విరుచుపడ్డారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ అని కేసీఆర్ కు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకుంటే తారకరామారావు అని మార్చాడని అన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ తీసేస్తారా అని కేటీఆర్ కు సవాల్ చేశారు.
మీ అయ్యను తీసుకురా కరీంనగర్ కు ఏం చేశానో చర్చకు సిద్ధమని, ఎంపీగా ఏం చేశానో కేసీఆర్ కు బుక్ లెట్ పంపించానని బండి సంజయ్ చెప్పారు. రాముడిని వ్యతిరేకించే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. చనిపోతానని తెలిసి కూడా అయోధ్యకి పోయి కట్టడాన్ని కూల్చిన వ్యక్తిని తానని, రాముడి గుడి కట్టడం కోసం వందల మంది కార్యకర్తలు చనిపోయారని అన్నారు.
ALSO READ :- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు
కండకావరం, అహంకారం తలకెక్కి కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, అభివృద్ధి, రామ మందిరంపై ఎన్నికల్లోకి వెళ్లేందుకు మీము సిద్ధంగా ఉన్నామని, దేవుడిని నమ్మని సన్నాసి కేటీఆర్, రాముడి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. వేములవాడ ,కొండగట్టు, ధర్మపురి పోయి ఆలయాల అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మోసం చేశాడని ఆయన ఆరోపించారు. కేటీఆర్.. నోరు హద్దులో పెట్టుకో, లేకుంటే కరీంనగర్ లో అడుగు పెట్టవని కౌంటర్ ఇచ్చాడు.