వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్నర్ మీటింగ్ లో సంజయ్ మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అయోధ్యలో రామమందిరనిర్మాణం అనే శతాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు సంజయ్. రామమందిర కల సాకార కావడంలో ఎందరో మంది త్యాగాలున్నాయని చెప్పారు.అయోధ్యలో బాబ్రీ మసీదుండాలని కొందరు అంటున్నారని.. అలాంటి మాటలు మాట్లాడితే తొక్కుతామని హెచ్చరించారు.
వారసత్వరాజకీయాలకు బీజేపీ దూరమని చెప్పారు సంజయ్. ఎవరి పేరో చెప్పుకొని మోదీ రాజకీయాల్లోకి రాలేదన్నారు. మోదీ కారణంగానే దేశం కరోనా నుండి సురక్షితంగా బయటపడిందని.. వ్యాక్సిన్ ఉచిత పంపిణీ చేయకుంటే మనం ఇలా మాట్లాడుకునే వాళ్లం కాదన్నారు. అయోధ్యలో రామమందిరం ఉండాలంటే మళ్ళీ మోదీ సర్కార్ తప్పనిసరిగా రావలన్నారు.