కాంగ్రెస్ గల్లీలో లేదు..ఢిల్లీలో లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. 2023 జూన్ 11 ఆదివారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో కలిసి ఆయన ర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పెంచి పోషిస్తున్నడని బండి సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ బలంగా లేని చోట 30 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా చేస్తున్నారని అన్నారు. ఎంఐఎం సైతం వారికే మద్దతు ఇస్తు్దని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సిద్ధాంతాలు లేవని చెప్పారు బండి సంజయ్. --
బీఆర్ఎస్ సిద్దాంతం దోచుకోవడం అయితే.. కాంగ్రెస్ సిద్దాంతం దేశ ద్రోహులతో స్నేహం చేయడం అన్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ సిద్దంగా ఉందన్నారు. బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.