తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంఐఎం చీఫ్ ఒవైసీ ఇద్దరు అన్నదమ్ముళ్లని అని అన్నారు బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఒవైసీ కేవలం చార్మినార్ కు మాత్రమే పరిమితం కాకుండా, దమ్ముంటే రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలన్నారు. అధికార పార్టీ దగ్గర మజ్లిస్ డబ్బులు తీసుకుంటుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినా వాళ్లు ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని సంజయ్ తెలిపారు.
గవర్నర్ కు భయపడే సీఎం కేసీఆర్ సయోధ్యకు వచ్చారని బండి సంజయ్ అన్నారు. బిల్లుల ఆమోదం కోసమే గవర్నర్ కలిశాడని చెప్పారు. చంద్రయాన్ 3 సక్సస్ కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం అక్కడ కూడా దందా ఎలా చేయాలని ఆలోచిస్తు్ందన్నారు. కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలం పైనే చేస్తారని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఏం బిజినెస్ చేసి కోటీశ్వరులు అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పై బీజేపీ పోరాటం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు.