బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటిస్తుందా : బండి సంజయ్‌

తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.  అంతకు రెట్టింపు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఉందన్నారు.  కరీంనగర్ లో రెండో రోజు బీజేపీ ప్రచార పాదయాత్రలో భాగంగా సంజయ్ ఈ కామెంట్స్ చేశారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ను పావుగా కేసీఆర్ వాడుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు.  

సీఎం కేసీఆర్ కు దమ్ముంటే బీసీని లేదా ఎస్సీ, ఎస్టీ లేదంటే అగ్రవర్ణాల్లోని పేదను సీఎం చేస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు సంజయ్. కాంగ్రెస్ కు కూడా ఇదే సవాల్ ను స్వీకరిస్తుందా అని సంజయ్ ప్రశ్నించారు.  కేవలం పేదల గురించి అలోచించి పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు.  ఎంఐఎం మద్ధతుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని సంజయ్ ఆరోపించారు.

ఈడీ లాంటి సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. ఎవరి తప్పుంటే వాళ్లపై ఈడీ లాంటి సంస్థలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు.  కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.