కేసీఆర్ నా గురువు.. ఆయన ఎలా ఉన్నారో చూపించు కేటీఆర్ : బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు గురువని బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.  కేసీఆర్ ను చూసే తాను భాష నేర్చుకున్నానన్నారు.  సీఎం గతకొన్ని రోజులుగా  కనిపించడం లేదని, ఆయనకు ఏమైందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.  సీఎంను ఆయన కొడుకు ఏం చేస్తుండో అని తమకు భయంగా ఉందన్నారు.   సీఎంకు  రక్షణ కల్పించాలని, ఆయన నిండు నూరేళ్లు  బతకాలని  సంజయ్ చెప్పారు.  ఆయన ఎలా ఉన్నారో తమకు చూపించాలన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు

.నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యం అందించిన ఘనడు సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అయితే... కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు  అమిత్ షా వచ్చారని బండి సంజయ్ చెప్పారు.  తెలంగాణలో  బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు గ్రూప్ 1 కు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు.  అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది మోదీ రాజ్యమేనని .. ఎవరూ ఆపలేరని  బండి సంజయ్‌ అన్నారు.