ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే బాధ్యుడు : బండి సంజయ్‌

రాష్ట్రంలో పంట నష్టంపై సీఎం కేసీఆర్ వెంటనే  శ్వేతపత్రం విడుదల చేయాలని కరీంనగర్  ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.  శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వల ప్రాజెక్టును ఆయన 2023 ఆగస్టు 05 శనివారం రోజున  సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

రుణమాఫీ చేస్తామని, పంటనష్టం ఇస్తామని కేసీఆర్ మోసపు హామీలు ఇచ్చారని సంజయ్ ఆరోపించారు.   రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను .. లీజుకా లేక అమ్మేస్తారా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నిం చారాయన.  ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే బాధ్యుడన్నారు.  గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ కాల్చుతున్నారని, అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు. 

ఆర్టీసీ బిల్లుపై తప్పు జరిగితే గవర్నర్ పై తోసేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.  గవర్నర్ పేరు చెప్పి ఆర్టీసీ విలీనాన్ని కేసీఆరే అడ్డుకుంటున్నారని సంజయ్ అన్నారు.   రాష్ట్రంలో గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదన్నారు బండి సంజయ్. కార్మి్కులకు న్యాయం చేయాలనే గవర్నర్  చూస్తున్నారని వెల్లడించారు.