కేసీఆర్ చేస్తున్నది రాజశ్యామల యాగం కాదు... జనవశీకరణ క్షుద్ర పూజలు : బండి సంజయ్

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్ చేస్తున్నది  రాజశ్యామల యాగం కాదని,  జనవశీకరణ క్షుద్ర పూజలని అన్నారు. సమాజానికి చెడు జరగాలని కోరుకునే వాళ్లకు దైవం తగిన శాస్తి చేయడం తథ్యమని చెప్పారు.  కరీంనగర్ అసెంబ్లీ ఈస్ట్ జోన్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విస్త్రతస్థాయి సమావేశంలో సంజయ్ పాల్గొన్నారు.  

కేసీఆర్ పాలనలో బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సంజయ్ చెప్పారు.  పొరపాటున కరీంనగర్ లో మళ్లీ  బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఎగిరేది మజ్లిస్ జెండానే అని ఆరోపించారు.  ఏదైనా జరిగితే  బొట్టు పెట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు.  పాతబస్తీలాగా కరీంనగర్ అభివృద్ధికి దూరమవుతందన్నారు సంజయ్.  

తనని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ ప్రజలు తలెత్తుకునే చేశానని, అలాంటి చరిత్ర తనదని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.  బ్యాలెట్ బాక్సులు తెరిస్తే బీఆర్ఎసోళ్ల బాక్సులు బద్దలు కావాల్సిందేనని చెప్పారు.