కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనయ్​..మజ్లిస్​ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ పోటీకి దూరం: కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనయ్​..మజ్లిస్​ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ పోటీకి దూరం: కేంద్ర మంత్రి బండి సంజయ్
  • వారి కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం
  • త్వరలోనే ఆరెండు పార్టీలు కలిసే బహిరంగ సభకు ప్లాన్​

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందన్నారు. ‘మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు. నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేశారు. 

►ALSO READ | హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు పరీక్ష

ఇవాళ మజ్లిస్ ను గెలిపించేందుకు రెండు పార్టీలు హైదరాబాద్​ఎమ్మెల్సీ పోటీకి దూరమమయ్యాయి. ఇక బీఆర్ఎస్ అవినీతి కేసుల సంగతి సరేసరి.. నీరుగార్చేశారు. వారి కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. ఈసభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నయ్. ఎవరిని పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నయ్’ అని అన్నారు.