కేసీఆర్ తాంత్రిక పూజల్లో ఆరితేరిండు.. నిమ్మకాయ ఇచ్చిన తీసుకొవద్దు : బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చేసేవన్నీ తాంత్రిక పూజలేనని ఆరోపించారు.  ఇలాంటి పూజల్లో కేసీఆర్ ఆరితేరారారని అన్నారు.  పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కరీంనగర్ లో మొక్కలు నాటారు సంజయ్. అనంతరం ఆయన మాట్లాడుతూ..   ఇతర పార్టీల్లోని నేతలను, తమ పార్టీల్లో చెబితే వినని నేతలను నాశనం చేసేందుకు పవర్ ఫుల్ తాంత్రికులను తెచ్చి కేసీఆర్ పూజలు చేయించారని సంజయ్ ఆరోపించారు.  కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా కట్టుకోవద్దని ఆ పార్టీ నేతలకు సూచిస్తున్నానని తెలిపారు.  సీఎం వ్యక్తిత్వమే అలాంటిదని ,  ఇతరుల నాశనాలు కోరుకుంటాడన్నారు.  

Also Read : కాంగ్రెస్ లోకి మైనంపల్లి.. సెప్టెంబర్ 27 ముహూర్తం ఖరారు

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈసారి గెలిచేది లేదన్నారు బండి సంజయ్.  ఆ పార్టీ వాళ్లకు విధివిధానాలే లేవన్నారు.  కాంగ్రెస్ ఎప్పుడుంటుదో.. ఎప్పుడు బాంబులా పేలిపోతుందో తెలియదన్నారు.  కాంగ్రెస్ లో గెలిచినా డబ్బులకు అమ్ముడు పోతారని కేసీఆర్ కు తెలుసన్నారు.  కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు ఏటీఎం లాంటిదని విమర్శి్ంచారు.  కాంగ్రెస్ లో కులాల కొట్లాట, బీఆర్ఎస్ డబ్బుల కొట్లాట ఉందన్నారు.  

కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి టికెట్ ఇవ్వడన్నారు బండి సంజయ్.  ఒకవేళ ఇచ్చినా వారిని ఓడించి.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని తీసుకుంటాడన్నారు.  ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా.. కేసీఆర్ ను ఓడిద్దామా అనే కసిలో ప్రజలు ఉన్నారని అన్నారు.   కరీంనగర్ లో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయన్న సంజయ్.  పార్టీలో చేరిన వారికి 5 లక్షలు, పది లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు.  బీసీబంధు, దళితబంధు పేరిట యువకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  

గ్రూప్-1 సరిగ్గా నిర్వహించే సత్తాలేని సర్కారు ఇదని బండిసంజయ్ విమర్శి్ంచారు. సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదన్నారు.  గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకని ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు.  ఇంటర్మీడియట్, టెన్త్, గ్రూప్-1 లాంటి అన్ని రకాల పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.  గ్రూప్-1 విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.  విద్యావ్యవస్థను కేసీఆర్ నాశనం చేసారని ఆరోపించారు.