పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆమెరికాకు కేసీఆర్ కుటుంబం జంప్ : బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ  సీటు కూడా గెలవకపోతే  కేసీఆర్ కుటుంబం అమెరికాకు పారిపోతుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్ధి ఎవరో ప్రకటించే దమ్ము ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థి లేని ఆ  పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. గంగాధరలో జరుగతున్న ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ మాట్లాడారు.  

జీతాలివ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవ్..  ఆలాంటిది 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.  ఎన్నికల్లో అందరికీ పథకాలంటూ చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు  కొందరికే పరిమితం చేస్తుందని మండిపడ్డారు.  సాగునీటిని విడుదల చేయకపోవడంవల్ల రాష్ట్రంలో  పంటలు ఎండిపోతున్నాయని..  తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  మోదీకి ఓటేయకపోతే రైతులపై రూ.15 వేల భారం పడుతుందని చెప్పారు.  కాంగ్రెస్ కి ఓటేస్తే గెలిచిన ఎంపీలు  పాకిస్థాన్ ,బంగ్లాదేశ్ నుంచి నిధులు తీసుకొస్తారా అని సంజయ్ ప్రశ్నించారు.  

ALSO READ :- తాగుదాం అని పిలిచి.. కొట్టి చంపిండ్రు..