మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు దోచుకు తిన్నారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, సీఎంఓలో పనిచేసిన అధికారుల పాస్ పోర్టులు సీజ్ చేయాలన్నారు. వీళ్లపై విచారణ ప్రారంభిస్తే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి అక్రమ అస్తులు స్వాధీనం చేసుకోవాలిని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లెమెంట్ స్థాయి సమావేశంలో సంజయ్ ఈ కామెంట్స్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని అన్నారు బండి సంజయ్. దేశమంతా మోదీ గాలి వీస్తోందన్న సంజయ్.. 350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతేనని విమర్శించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.