- అభివృద్ధిలో ప్రపంచానికే మనమే రోల్‌మోడల్
- హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమీలో పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన బండి సంజయ్
హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్వన్స్థానానికి చేరుకోవడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. ఇవాళ హైదరాబాద్ హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమి ‘రోజ్ గార్ మేళా’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి ఉన్నత మధ్య ఆదాయ దేశంగా భారత్అవతరించే అవకాశం ఉందన్నారు. ‘ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
నేటితో 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నం. గతంలో మోదీ 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటే హేళన చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత ఆర్ధిక వ్యవస్థ 4.66 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం మోదీదే. మోదీ పాలనలో ఆర్ధిక ప్రగతిలో 5వ స్థానానికి చేరుకున్నం. కొత్తగా ఉద్యోగాలు సాధించినవారికి నా శుభాకాంక్షలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను, సేవలను జనంలోకి తీసుకెళ్లే గొప్ప బాధ్యత మీపైన ఉంది. రానున్నా రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలిస్తుంది.
ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక స్టార్టప్‌లతో పాటు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నం. అంతరిక్షం, క్రీడల్లో సత్తా చాటుతున్నం. దేశంలో అవినీతి పూర్తిగా అంతమవుతుంది. అభివృద్ధిలో ప్రపంచానికే మన దేశం మార్గదర్శి అవుతుంది. ’ అని బండి సంజయ్ అన్నారు.