వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదన్నారు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక పద్ధతి లేదని ఆయన విమర్శించారు. సీఎం ముందే నిధులు ఇచ్చి ఉంటే అన్ని పనులు సౌకర్యాలు కల్పించే వారన్నారు. తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో గవర్నర్ ఉంటారన్నారు. గవర్నర్ ను అవమానించడం దారుణమన్నారు బండి.
గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం అనేది సరైంది కాదన్నారు. గవర్నర్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించారన్నారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను పిలవక పోవడానికి కారణం ఎంటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రవర్తించాలన్నారు. లేకపోతే ప్రజలు కచ్చితంగా తిరగబడతారన్నారు.