పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: బండి సంజయ్

పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: బండి సంజయ్

ఆదివారం ( ఏప్రిల్ 20 ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేద ముస్లీములకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అని అన్నారు. బడాచోర్ లందరు కలిసి మీటింగు పెట్టడం సిగ్గుచేటు అని.. పేద ముస్లీములను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు బండి సంజయ్. 

టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం ది అని.. 8లక్షల ఎకరాల భూమి,10లక్షల కోట్ల సంపద ఉన్నా.. ఒక్క పేదవాడికి ఉపయోగపడని సంస్థ వక్ఫ్ అని అన్నారు. రాముడి గురించి ఆధారాలు అడిగిన మీరు..  వక్ఫ్ గురించి ఆదారాలు ఎందుకు అడగరని మండిపడ్డారు బండి సంజయ్. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని.. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.

మంచి ఉద్దేశ్యంతో బిల్ తీసుకువస్తే..ప్రతిపక్ష పార్టీలు మత కోణంలో విద్వేశాలు రెచ్చగొడుతున్నాయని ఫైర్ అయ్యారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని..కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం తాపత్రయ పడుతున్నాయని అన్నారు బండి సంజయ్.