![మంత్రి గంగుల తండ్రి మృతి పట్ల బండి సంజయ్ సంతాపం](https://static.v6velugu.com/uploads/2023/01/Gangula-Mallaiah_SP2rIVpl9m.jpg)
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి, గంగుల మల్లయ్య మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
మల్లయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) ఇవాళ కరీంనగర్ లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు.