తెలంగాణలో కాషాయ జెండా ఎగురుడు పక్కా : బండి సంజయ్​

తెలంగాణలో కాషాయ జెండా ఎగురుడు పక్కా : బండి సంజయ్​

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అని కరీంనగర్​ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆయన ఆగస్టు 23న బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్​బూత్​మేళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెబుతారని విమర్శించారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. 

అనంతరం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్​పాపన్న విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బూత్​మేళలో భాగంగా చేవెళ్ల కూడలి నుంచి సీహెచ్​ఆర్​గార్డెన్స్​వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్​లీడర్లు కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్​రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.