బీజేపీపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

  • చరిత్ర సృష్టించేలా మోదీ సభను సక్సెస్ చేయాలి: బండి సంజయ్

హనుమకొండ/కరీంనగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలోని హనుమకొండ ఆర్ట్స్‌‌‌‌ కాలేజీ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను చరిత్ర సృష్టించేలా, కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్‌‌‌‌ చేయాలని బీజేపీ కార్యకర్తలకు, నేతలకు కరీనంగర్ ఎంపీ బండి సంజయ్‌‌‌‌ పిలుపునిచ్చారు. ఇందు కోసం ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని సభకు తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని మొరిగే వాళ్లకు మోదీ సభ సక్సెస్‌‌‌‌తోనే సమాధానం చెప్పాలన్నారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ పరిశ్రమపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లాకు తెచ్చిన పరిశ్రమలేవీ లేవని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా ఇన్‌‌‌‌చార్జి మురళీధర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర నిధులతోనే తీగలగుట్ట ఆర్వోబీ, కరీంనగర్ వరంగల్ ఫోర్ లేన్ హైవే..

రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ వరంగల్ జిల్లాకు వస్తున్నారని, అందులో భాగంగానే కరీంనగర్–వరంగల్ హైవే 563 ఫోర్ లేన్ విస్తరణ పనులను ప్రారంభిస్తారని సంజయ్‌‌‌‌ తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలు, శక్తి కేంద్ర ఇన్‌‌‌‌చార్జిలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తీగలగుట్ట ఆర్వోబీ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌–వరంగల్‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌ హైవే పనులు జరగనున్నాయని తెలిపారు. గజ్వేల్‌‌‌‌లో శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన దుండుగులను అడ్డుకున్న సామాన్య కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. 

ఈ సందర్భంగా కరీంనగర్ జైలులో గజ్వేల్‌‌‌‌కు చెందిన 11 మంది బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. శుక్రవారం మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు నిర్వహించి, బయటికి వస్తుండగా అభిలాష్ అనే కార్యకర్త సంజయ్‌‌‌‌ను పట్టుకుని ఏడ్చాడు. అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై కన్నీటిపర్యంతమయ్యాడు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధి రాణిరుద్రమ దేవి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సీనియర్ నేత బాస సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఉన్నారు.