కేటీఆర్ కి మీడియా ఫోబియా.. ఓవైసీలకు ఉగ్రవాదులతో లింక్: బండి సంజయ్

కేటీఆర్ కి మీడియా ఫోబియా.. ఓవైసీలకు ఉగ్రవాదులతో లింక్: బండి సంజయ్

మాజీ మంత్రి కేటీఆర్ కి మీడియా ఫోబియా ఉందని.. అమృత్ పనుల్లో అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయకుండా బీజేపీని ఎందుకు తిడుతున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలోపాయికారి ఒప్పందం జరిగిందని.. ఏనాటికైనా గులాబీపార్టీ హస్తం పార్టీలో విలీనం. కావడం ఖాయం అని అన్నారు. ఎంఐఎం పార్టీ నేతలు, ఓవైసీ సోదరులకు  ఉగ్రవాదులతో   సంబంధాలున్నాయని.. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటుకు కేసు విచారణ ఎందుకు జర పలేదని ప్రశ్నించారు. వన్నేషన్, వన్ ఎలక్షన్కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైనా అభిప్రాయం చెప్పడం తప్పేమీ కాదన్నా రు. హైడ్రాకు తాము వ్యతిరేకంగా కాదని, కానీ పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం విచారణ చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఉన్నా రని.. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కరీంనగర్ జ్యో తినగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. 'బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఏమైంది? ఓటుకు నోటు ప్రస్తావన ఏనాడైనా బీఆర్ఎస్ నేతలు తెచ్చారా? 5,060 చెరువులను కేసీఆర్, ఆయన కుటుంబమే ఆక్రమించిందన్న ఫిర్యాదులున్నాయి. 

ఇద్దరి మధ్య దోస్తానా చెడినట్లుంది. అందుకే అమృత్ నిధులు కుంభకోణం బయటకు తెచ్చారు. త్వరలోనే ఈ విషయంలో మాట్లాడుకుని కలిసిపోతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయా యి. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ మంత్రులు అవినీ తికి పాల్పడుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు మేం వ్యతిరేకం కాదు. ఆక్రమణలకు పాల్పడిన వారంతా బీఆర్ఎస్ లోని ఏదో ఒక నాయకుని ప్రోద్భలంతో చేసారు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం లేదు. డాక్యుమెంట్లు చూసి అక్కడభూములు కొనుగోలు చేసిన వాళ్లు మోసపో యారు. వాళ్లకు అమ్మినవాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. పొట్టకూటి కోసం వ్యాపారం చే చే సుకుంటుంటే రాత్రికి రాత్రే కూల్చివేసి వారి పొట్టగొ ట్టారు. చెరువుల ఆక్రమణలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోనంత వరకు హైడ్రా ఏంచేసినా వృథా ' బండి సంజయ్ ని అన్నారు.