రాష్ట్రంలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారు

చేనేత ద్రోహి కేసీఆర్ అని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ లో చేనేత రంగాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎన్నికల తర్వాత కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి మహోన్నత వ్యక్తిని కూడా కేసీఆర్ అవమానించారన్నారు. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించే  హక్కు లేదన్నారు. భువనగిరి జిల్లా ఎన్నారంలో చేనేత కార్మికుల సమ్మేళనం సభలో మాట్లాడిన బండి సంజయ్...కేసీఆర్ అవినీతి, అరాచకాలను అరికట్టాలంటే ప్రజలు టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.