కరీంనగర్ లోని మానేరు వాగులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. పిల్లల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన వారిలో వీరాంజనేయులు (12), అనిల్ (13), సంతోష్(14) గా గుర్తించారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం
ముగ్గురు చిన్నారుల మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి గంగుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు, మంత్రి గంగుల తరపున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.