స్కాములకు డబ్బులున్నాయ్ కానీ.. ప్రజలకు మాత్రం లేవట : బండి సంజయ్

ఢిల్లీలో దీక్ష పేరుతో సీఎం కేసీఆర్ మందు తాగిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే.. అదంతా తామే చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు కాని.. లిక్కర్ వ్యాపారం చేయడానికి ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని సీఎం కేసీఆర్ చూస్తుండని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయాలు సంపాదించారని హరీష్ రావు పై విమర్శలు చేశారు. 

బీజేపీకి యాత్రలు కొత్తకాదని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా  బీజేపీ యాత్రలు సాగుతూనే ఉంటాయన్నారు. జయశంకర్ జిల్లా మంథని గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.