- కానీ మొన్న ఓట్లన్నీ కాంగ్రెస్‌కే వేసిర్రు
- యాత్ర పూర్తయిన వెంటనే నీళ్లకోసం కొట్లాడుతా
- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
బోయినిపల్లి: కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్‌గాంధీ ప్రకటించడంపై బీజేపీ ఎంపీ బండి సంజ య్ స్పందించారు. కాంగ్రెస్‌పార్టీలోని పదవుల్లో సగం మహిళలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజహిత సంగ్రామ యాత్ర కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినవే నన్నా రు. రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలన్నీ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకే దిక్కులేదన్నారు. వెంటనే మహిళల ఖాతాల్లో రూ. 2,500 వేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు పైసలు ఇచ్చింది మోదీ అని, కానీ మొన్న ఓట్లు మాత్రం కాంగ్రెసోళ్లకు వేశారని అన్నారు. మిడ్ మానేర్ మొదటి వరద కాలువలోనే నీళ్లకు దిక్కులేదని, కానీ రెండో కాలువ తవ్వుతాడట అని సీఎంను ఎద్దేవా చేశారు. యాత్ర పూర్తయిన వెంటనే నీళ్లకోసం కొట్లాడుతూ అని ఆయన ప్రకటించారు. కేంద్రంలో మోడీ వస్తాడని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులే అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానలను గెలిపించి 400 సీట్లతో మూడోసారి కేంద్రంలో బీజేపీ ని అధికారంలోకి తేవాలన్నారు.