మంత్రి గంగుల కమాలాకర్ మళ్లీ గెలిచేందుకు లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడని ఆరోపించారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడి సమస్యలపై అవగాహనే లేదన్నారు. ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పాలని కోరారు.
కరీంనగర్ లో తనను తిట్టడానికే సీఎం కేసీఆర్ సభ పెట్టుకున్నారని సంజయ్ విమర్శించారు. కరీంనగర్ వచ్చి అభివృద్ధి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్ని్ంచారు. ప్రజల కోసం పోరాడి జైలుకు పోయిన చరిత్ర తనదని తెలిపారు. మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజవేస్తారన్నారు సంజయ్.
ప్రజల కోసం పోరాడుతున్న తన మీద 74 కేసులున్నయ్ అని చెప్పారు సంజయ్. మీకోసం కొట్లాడితే కేసీఆర్ తనకు ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులని చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని పక్కన పెట్టి పాతబస్తీలో సభ పెడితే తనను బెదిరించారన్నారు సంజయ్. ప్రత్యర్థులు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెల్వని పరిస్థితి తనదని వెల్లడించారు.