కేసీఆర్ అనాలోచిత, అర్థరాత్రి నిర్ణయాలతోనే ఇబ్బందులు

సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్థరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  ప్రభుత్వం వెంటనే జీవో 317 అమలును నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే  వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే ట్రాన్స్ ఫర్లు చేయమని కోరుతున్నామని చెప్పారు. 36 నెలలలోగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాల్సి ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు చర్చించకుండా, ఉద్యోగులు, టీచర్ల అభిప్రాయాలు తీసుకోకుండా వారితో పాటు వారి కుటుంబసభ్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో సీఎం స్పందించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు 

పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులు పెట్టాలి