యాక్టివ్ సీఎం కేటీఆర్.. రేవంత్, కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యిండ్రు: కేంద్ర మంత్రి బండి సంజయ్

యాక్టివ్ సీఎం కేటీఆర్.. రేవంత్, కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యిండ్రు: కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ యాక్టివ్ సీఎం అని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాష్ట్రంలో కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే మొన్న జన్వాడ కేసును వదిలేశారని ఆరోపించారు. కేటీఆర్ ను రేవంత్ సర్కారు అరెస్టు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మీడియాలో కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ బావమర్ది మీద కేసైతే ఎమ్మెల్యేలంతా వెళ్లారని, ఆ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అన్నారు. 

ALSO READ : బుల్డోజర్లు ఎక్కించి మరీ మూసీ ప్రాజెక్టు చేపడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్కు అహంకార ధోరణి తగ్గలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే దమ్ము బీఆర్ఎస్ కు లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో.. లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచుల పొట్టగొట్టి.. ఇప్పుడు వాళ్ల పక్షానే ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ వాళ్లను ఉద్యమాలకు పిలిస్తే నష్టపోతామని ఆందోళనకారులు కూడా ఆలోచించాలని అన్నారు.

కేటీఆర్ అహంకారి అని, ప్రధాని మోదీని ఏకవచనంతో  పిలుస్తున్నారని అన్నారు. డబ్బుతోనే అహం తలకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, రేవంత్ ఒక్కటేనని తన సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ నమ్మించే  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ గత చరిత్ర, వాళ్ల నాన్న చేసిన వ్యాపారం అందరికీ తెలుసునని అన్నారు. ఆయనకు ఆయనే మలేషియా పారిపోయాడని కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ లో క్రెడిబిలిలీ ఉన్న లీడర్ హరీశ్ రావు అని, ఆయన బీజేపీలో చేరుతానంటే తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదనని, పార్టీ సమిష్టిగా చర్చించి డెసిషన్ తీసుకుంటుందని అన్నారు. తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదని అన్నారు. తన బిడ్డ పెండ్లికి వెళ్లకుండా బీఆర్ఎస్ సర్కారు అడ్డుకున్న సందర్భాన్ని సీఎం రేవంత్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. జైలుకు పంపిన వారితో కాంప్రమైజ్ అవుతారా..? అని ప్రశ్నించారు.