కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వైద్య పరికరాల కోసం 3కోట్లు అందజేశారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీలో జాతీయ రహదారుల నిర్మాణానికి 5వేల 751 కోట్ల నిధులు తీసుకొచ్చారని తెలిపారు. సీఆర్ఐఎఫ్ ద్వారా 216 కోట్లతో పాటు 30 కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేశారన్నారు.
కరీనంగర్ చొప్పదండి మార్గంలో రైల్వేగేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జికు కేంద్రం నుంచి 100 కోట్లు తీసుకొచ్చారని చెప్పారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా తీసుకొచ్చినట్లు తెలిపారు. రుక్మాపూర్లో సైనిక స్కూల్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. పాఠశాలల్లో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం సర్వశిక్షఅభియాన్ కింద 46 కోట్లు తీసుకొచ్చారన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం 19కోట్ల నిధులు, ఉపాధిహామి కోసం 612 కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చారని తెలిపారు.