
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కాంగ్రెస్ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని.. బ్రిటీషోడు స్థాపించిన పార్టీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మహాత్మాగాంధీ అసలు సిసలైన గాంధీ అని.. ప్రస్తుతం కాంగ్రెస్ ను ఏలుతున్నది డూప్ గాంధీ కుటుంబమంటూ సంచలన కామెంట్స్ చేశారు. మానకొండూరులో ఎస్సీ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్నారు బండి సంజయ్.
Also Read:సెమీ ఫైనల్లో కేసీఆర్ ని ఓడించాం... ఫైనల్లో బీజేపీని బొందపెట్టాలె
బీజేపీ అంటే భారతీయ ఆత్మ అని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు.. రాష్ట్రానికి పట్టిన శని అని విమర్శించారు. దళితుల కోసం బీజేపీ పాటుపడుతుందన్నారు.అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు సంజయ్. జూన్ 4న బీఆర్ఎస్ కు పాతరేసి కాళోజీ మాటలను నిజం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55 శాతం గుంజుకోవడం ఖాయమని ఆరోపించారు బండి సంజయ్.