కరీంనగర్: “ మ్యాథ్స్, సైన్స్ పేపర్ లీక్ చేసినా తనకు పేరు వచ్చేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో జరిగిన ఓ ప్రొగ్రాంలో విలేకర్లతో మాట్లాడుతూ టెన్క్లాస్ పేపర్ లీక్ చేశానని, తనపై దొంగ కేసు నమోదు అయ్యిందన్నారు. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ అయిన తరువాత తాను రెండుసార్లు జైలుకు వెళ్లానని అన్నారు.
తాను ఫైట్ చేసేవాడినని ఆయన పేర్కొన్నారు. గతంలో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ ఆరోపణలతో సంజయ్‌పై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగాఆయన మాట్లాడారు.