దేశానికి దశ, దిశ చూపేది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ 48, 58 డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ తో సహా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. పాతబస్తీలోనూ హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలాది బోగస్ ఓట్లు పడ్డాయన్నారు బండి సంజయ్. భారీ ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఈరోజు రాత్రి హుజూరాబాద్ లోని రంగాపూర్ లో రాత్రి బస చేస్తున్నట్లుగా బండి సంజయ్ తెలిపారు.