రేపు ప్రతి ఇంటా ఐదు జ్యోతులు వెలిగించండి : బండి సంజయ్

అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు సాయంత్రం రాష్ట్ర ప్రజలంతా తమ తమ ఇండ్లలో ఐదు జ్యోతులు వెలిగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.   శతాబ్దాల కల నెరవేరబోతున్న శుభ ఘడియలు ఆసన్నమైనందున హిందూవులంతా శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షిస్తూ  దీపావళి సంబురాలు జరుపుకోవాలని చెప్పారు.  

ఈ మహా పర్వదినం వేళ పెద్ద ఎత్తున ప్రజలు  ఆలయాలను సందర్శించుకునేందుకు సిద్ధమైనందున దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయాలను దర్శించుకునే ప్రజల కోసం ప్రభుత్వం కరెంట్, తాగునీటితోపాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశారు.