కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. తాను చదువుకున్న పాఠశాలకు కొత్త భవనం నిర్మించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి సరస్వతి శిశుమందిరే కారణమని చెప్పారు.
శిశుమందిరాలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని చెప్పారు. శిశుమందిర్లో చదవాలంటే అదృష్టం ఉండాలన్న సంజయ్.. ఈ స్కూళ్లో చదివితే దేశం, ధర్మం కోసం పాటుపడాలనే ఆలోచన వస్తుందన్నారు.