రైతులను ఆదుకోండి.. ప్రభుత్వాన్ని కోరిన బండి సంజయ్

అకాల వర్షాలతో పంట నష్టపోయిన  కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు.  పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.  తనకున్న 2 ఎకరాల పొలంతోపాటు మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని చెప్పారు నారాయణ. ఎకరాకు రూ.10 వేలు కౌలు పైసలివ్వడంతోపాటు పెట్టుబడి కింద రూ.లక్షన్నర ఖర్చు చేశానని తెలిపారు.  

కానీ అకాల వర్షాలతో 5 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, తాలు మాత్రమే మిగిలిందని నారాయణ వాపోయారు.   పంట నష్టంతో చేసిన అప్పులు తీర్చే  పరిస్థితి లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు రైతు నారాయణ. బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలంటూ రైతు నారయణకు దైర్యం చెప్పారు బండి సంజయ్. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.