కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిటీలోని ఈఎన్ గార్డెన్స్‌లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ సెగ్మెంట్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్, శక్తి కేంద్రాల బాధ్యులు సరైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కాషాయ జెండా ఎగరేసేందుకు గడపగడపకు వెళ్లి ప్రచారం
చేయాలన్నారు. అనంతరం 36, 48వ డివిజన్లకు చెందిన యువకులతోపాటు టీడీపీ సీనియర్ లీడర్ మిట్టపల్లి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు శ్రీనివాస్ , అనూప్, ఆనంద్, జితేందర్, మాజీ మేయర్ డి.శంకర్, లీడర్లు సత్యనారాయణరావు, గుగ్గిల రమేశ్, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం, మంజులవాణి, కల్యాణ్ చంద్ర, సత్యనారాయణరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.