కరీంనగర్ సిటీ, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయి, బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. సోమవారం కరీంనగర్‌లోని ఎంపీ ఆఫీసులో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలంతా బీజేపీ పక్షానే ఉన్నారని, గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని కోరారు. బూత్‌లవారీగా బాధ్యతలు తీసుకోవడంతోపాటు పోలింగ్ సమయం నాటికి ప్రతి ఇంటికీ 10 సార్లు వెళ్లేలా ప్లాన్చేసుకోవాలని సూచించారు