వివేకానంద స్ఫూర్తితో యువత పనిచేయాలి : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు : నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్ రాపర్తి విజయ పాల్గొన్నారు.అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతి వేడుకుల జరిగాయి. ఎమ్మెల్యేలు, ఆయ యువజన సంఘాల నాయకులు పట్టణాల్లోని వివేకానంద విగ్రహాలకు పూల మాలలు వేసి, నివాళ్లర్పించారు.