కమలాపూర్/భీమదేవరపల్లి, వెలుగు: తను మఠం పెట్టుకోమని చెప్పిన కేటీఆర్.. ఆయన తాగుబోతు తండ్రి కేసీఆర్తో బార్షాపు పెట్టించాలని.. ముస్లింలకు అనుకూలంగా మాట్లాడే కేటీఆర్ మసీదు వెళ్లి నమాజ్ చేసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్అన్నారు. ఆదివారం సంజయ్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లలో తనపై కేటీఆర్చేసిన విమర్శలకు సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘నీ అయ్య కేసీఆర్బగ్గ తాగి ఫామ్ హౌస్లో పండేటోడు.. ఆయనతో బార్షాపు పెట్టించు.. ఎప్పుడూ ముస్లింల గురించి మాట్లాడే నువ్వు టోపీ పెట్టుకొని మసీదులో ప్రతిరోజు నమాజ్ చేయి..’ అంటూ ఫైర్ అయ్యారు. ‘మేధావిని గెలిపించాలంటూ కరీంనగర్లో ఒకరిని వెంటేసుకొని తిరుగుతున్నావ్.. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆ మేధావి ఏం అభివృద్ధి చేసిండో ఈ మొరిగే కేటీఆర్చెప్పాలె’ అని సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులోని (గద్దలబండ) హనుమత్ పురి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పులు చేసి మరీ అభివృద్ధి చేశామని చెప్పిన బీఆర్ఎస్, కనీసం సర్పంచులకు బిల్లులు కూడా ఇవ్వలేదన్నారు.