కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎంపీ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవబోతున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించిన తట్టుకుని కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడిన కార్యకర్తలే నిజమైన హీరోలని అభివర్ణించారు. ఎన్నికల్లో సహకరించిన మందకృష్ణమాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో లీడర్లు గుగ్గిళ్లపు రమేష్, రాపర్తి విజయ, గండ్ర నళిని పాల్గొన్నారు.