ఇది కోతల ప్రభుత్వం : బండి సంజయ్

ఇది కోతల ప్రభుత్వం : బండి సంజయ్
  • ఎకరాకు15 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పుతరా?: బండి సంజయ్ 

హైదరాబాద్, వెలుగు: ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతారా అని రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అసలు రైతులకు  కాంగ్రెస్ అదనంగా చేసిన సాయమేముందని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 

ఏడాదిపాటు ఎగ్గొట్టిన రైతు భరోసా సొమ్ముతో పోలిస్తే.. ఇంకా రైతులు నష్టపోయినట్లే కదా.. అని అన్నారు.  రుణమాఫీ, రైతుభరోసా సహా రైతులకు ఇచ్చిన హామీల అమలులో అన్నీ కోతలేనని విమర్శించారు.  ఆర్థిక పరిస్థితి తెలిసే పుట్టెడు హామీలిచ్చారు కదా.. అని నిలదీశారు. ఇందిరమ్మ పాలనంటే ఇంటింటా మోసం చేయడమేనా అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.