కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్

మంత్రి పొన్నం ప్రభాకర్ కు  కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని,  అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే అందుకు పొన్నం రెడీనా అని సంజయ్ సవాల్ విసిరారు.  సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. 

తాను ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు సంజయ్.  రాముడ్ని ఎవరైనా అంటే బరాబర్ కౌంటర్ ఇస్తానని చెప్పారు.  కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రి పొన్నం రెచ్చగొడుతున్నాడని..  హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక ఈ పనులు చేయిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. ఇంతకాలం గౌరవంతో మాట్లాడకపోతే చేతగానితనం అనుకుంటుండని అన్నారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   అటు బీజేపీ కార్యకర్తలు భారీగా రావడంతో టెన్షన్ నెలకొంది. ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.