- ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాదు ఉద్యోగాల భర్తీకి నెలరోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ కేసీఆర్ కు డెడ్ లైన్ విధించారు. నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమం చేపడతామని బండి సంజయ్ హెచ్చరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు...
- ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనం.
- ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదం.
- కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణీకంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటు.
- రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 3 ఏళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణం.
- తీరా గడువు ముగిసే సమయానికి హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులను మరింత గందరగోళంలో పడేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయ నిపుణులతో చర్చించకపోవడం సిగ్గుచేటు
- ప్రభుత్వ ఉద్యోగులను మరింత ఇబ్బందిపెట్టేలా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు.
- కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటు.
- ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలవల్ల భవిష్యత్తులో అనేక న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఏర్పడింది.
- ఈ జీవోను యధాతథంగా అమలు చేస్తే పలు జిల్లాల్లో ఏళ్ల తరబడి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశమే లేకుండా పోయే ప్రమాదం.
- ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలి.
- ఉద్యోగుల స్థానికత, సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు సర్దుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించాలి.
- మొత్తం ఈ ప్రక్రియనంతా 15 రోజుల్లోగా పూర్తి చేయాలని డిమాండ్.
- రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
- నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి. లేనిపక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
ఇవి కూడా చదవండి:
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష.. జరిమానా
శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. వేసుకున్న గుడిశెలను కూల్చేశారు
కత్రినా పెళ్లికి కాస్ట్లీ గిఫ్టులు