అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మళ్లీ వస్తున్నా... మీకోసం... దీవించండి' పేరుతో కరీంనగర్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. కరీంనగర్ లో పాదయాత్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హెలికాప్టర్ ద్వారా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు బండి సంజయ్.
మొదట.. నవంబన్ 6న కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. తర్వాత 7న కరీంనగర్ పట్టణం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రత నడుమ బండి సంజయ్ ప్రచారం చేయనున్నారు.