సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కేవలం తన చరిత్ర ఉంటే చాలనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబ చరిత్రే తెలంగాణ చరిత్ర గా మార్చాలని చూస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం పోరాడిన సర్వాయి పాపన్న చరిత్రను ప్రస్తుత ప్రభుత్వం మరుగున పడేస్తోందన్నారు సంజయ్. సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో  దొరల గడీలు బద్దలు కొట్టి నయా రజాకార్ల పాలనను అంతం చేద్దామన్నారు. సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం అంతా కృషి చేయాలన్నారు. ఔరంగ జేబుకే ముచ్చెమటలు పట్టించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరేసిన కొదమ సింహం సర్వాయి పాపన్న అని అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల శ్రేయస్సే లక్ష్యంగా నవ తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా అక్టోబర్ 24 న ప్రారంభమయ్యే ‘ప్రజా సంకల్ప యాత్ర’కు మీరంతా ఉప్పెనలా కదిలి రావాలన్నారు.