మహేష్ బాబును పరామర్శించిన బండి సంజయ్

మహేష్ బాబును పరామర్శించిన బండి సంజయ్

సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సినీ నటి జీవిత తదితరులు కృష్ణ భౌతికకాయనికి నివాళులు అర్పించారు.

కాగా, సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. నానక్ రామ్ గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగనుంది. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు చేయనున్నారు. కృష్ణ అభిమానుల రాకతో నానక్ రామ్ గూడలో ఫుల్ రష్ ఏర్పడింది. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెలంగాణ తోపాటు..ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వస్తున్నారు. ఇటు నానక్ రామ్ గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.