మోదీని చూస్తే కేసీఆర్ గజగజ వణుకుతున్నారు: బండి సంజయ్

సీఎం కేసీఆర్  కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో..ఆయన కుటుంబ ఆస్తులపై ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రధాని మోదీ బయటపెట్టారని.. మోదీని చూస్తే కేసీఆర్ గజగజ వణుకుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.

ప్రగతి భవన్ లో అలజడి మొదలైందని.. బీఆర్ ఎస్  నిట్టనిలువునా చీలడం ఖాయమని జోస్యం చెప్పారు బండి సంజయ్. మోదీని టూరిస్ట్ అని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ అభివృద్ధికి వ్యతిరేకమని.. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రెచ్చగొడుతున్నారని ప్రజలు ఆలోచించాలని అన్నారు బండి సంజయ్. 

తెలంగాణలో మోదీ 20 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారని బండి సంజయ్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, రైల్వే లైనులు నరేంద్ర మోడీ అందిస్తున్నారని‌ ప్రజలకి తెలిసి పోయింది.. మోడీని ప్రపంచ దేశాలు ఒక హీరోలాగా చూస్తున్నారు.. ఇది మింగుడు పడని బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం దేశ ప్రధాని మీద చిల్లర ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. 

తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారు.. కేసీఆర్ కుటుంబం తప్పా వేరే వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మోదీ పర్యటన తరువాత ప్రగతిభవన్లో‌ భూకంపం వచ్చిందన్నారు.  మోదీ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ అయిందన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అనగానే బిఆర్ఎస్ పార్టీ చీలి పొయే పరిస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్.